ఫేక్ కాల్స్ తో జాగ్రత్త..సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చు : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు : ట్రాయ్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ నెంబర్, బ్యాంకు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు ఇతరులకు చెప్పొద్దని సీపీ అనురాధ సూచించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చన్నారు.తెలంగాణ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో ఫేక్ కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయని

 ఫోన్స్ సిమ్ కార్డు బ్లాక్ అవుతున్నాయంటూ కాల్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దని కోరారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు కాల్ చేయాలని, లేదా <www.cybercrime.gov.in> వెబ్ సైట్​లో రిపోర్ట్ చేయాలని సూచించారు.