కొమరం భీం జిల్లాలో అగ్ని ప్రమాదం.. పత్తి వాహనం దగ్ధం

కొమరం భీం జిల్లాలో  అగ్ని ప్రమాదం జరిగింది.  కౌటాల మండలం ముత్యంపేట  సమీపంలో పత్తిలోడుతో బోలేరా వాహనం వెళుతుంది. ఈ సమయంలో ఇంజన్​ లో సాంకేతిక లోపం తలెత్తి.. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా  ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.  దీంతో 40 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. బెజ్జూరు మండలం నుంచి మహారాష్ట్ర రాజు జిన్నింగ్​ మిల్​ కు వెళుతుండగా ఘటన జరిగింది.  సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ..