తెగిన రోడ్లు.. నీట మునిగిన పత్తి

బెల్లంపల్లి రూరల్: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పత్తి పంట నీట మునిగింది. బీటి రోడ్లు సైతం కోతకు గురయ్యాయి. భీమిని మండలంలోని ఖర్జీభీంపూర్​కు వెళ్లే బీటి రోడ్డు వరద తాకిడికి కోతకు గురైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రెవెన్యూ అధికారులు తాత్కాలిక రిపేర్లు చేపట్టారు.

పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు, ఎర్రవాగు ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​తో చిన్నతిమ్మాపూర్ ​గ్రామ పరిధిలోనే సుమారు 60 ఎకరాల పత్తి పంట నీట మునిగింది. నెన్నెల మండల కేంద్రానికి చెందిన ముద్రకోల సదయ్య అనే రైతు నూతనంగా ఇంటి ప్రహరీపై పిడుగు పడడంతో నేల కూలింది. మల్లంపేట అటవీ ప్రాంతంలో చెట్లు పడిపోవడంతో వేర్వేరు చోట్ల మూడు విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. ప్రాణహిత నది, కొత్తపల్లి బతుకమ్మ వాగు పోటెత్తి ప్రవహిస్తున్నాయి.