మంచిర్యాలలో ఆటో యూనియన్ల మధ్య వివాదం

  •     పోలీస్​ స్టేషన్​కు చేరిన పంచాది

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాలలోని పాత, కొత్త ఆటో యూనియన్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ పంచాది పోలీస్​స్టేషన్​కు చేరింది. జిల్లాలో 20 ఏండ్ల కిందట ఆటో డ్రైవర్స్​ అండ్ ఓనర్స్ అసోసియేషన్​ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇదే యూనియన్​ఆధ్వర్యంలో ఆటో కార్మికులు కొనసాగుతున్నారు. రెండేండ్లకు ఒకసారి జిల్లా, మండల, పట్టణ కమిటీలను ఎన్నుకుంటున్నారు. ఇటీవల ఈ యూనియన్​కు చెందిన కొంతమంది నాయకులు వేరే యూనియన్​ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మంచిర్యాల కాంగ్రెస్​టౌన్ ప్రెసిడెంట్ తూముల నరేశ్​ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

అలాగే టౌన్​కమిటీని వేశారు. ఇదిలా ఉండగా, ఆటో డ్రైవర్స్​ అండ్​ ఓనర్స్​ అసోసియేషన్ నాయకులు మంచిర్యాల టౌన్​ నూతన కమిటీ ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ​ఈ క్రమంలో గురువారం మంచిర్యాల ఏసీపీ ఆర్​ప్రకాశ్, టౌన్ సీఐ బన్సీలాల్​సదరు యూనియన్​ నాయకులను పోలీస్​ స్టేషన్​కు పిలిచి ఎన్నికల ప్రయత్నాలను మానుకోవాలని సూచించినట్టు పొట్ట మధుకర్​ తెలిపారు. తమ యూనియన్​ ఇరవై ఏండ్లుగా ఆటో కార్మికుల సమస్యలు, హక్కుల కోసం పోరాడుతోందని  పోలీసుల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.