ఎస్పీ స్ఫూర్తితో.. హైస్కూల్​ను దత్తత తీసుకున్న కానిస్టేబుల్

నర్సాపూర్ (జి), వెలుగు: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) పీఎస్​కు చెందిన కానిస్టేబుల్ కృష్ణ చౌహన్ ఆ గ్రామ హైస్కూల్​ను దత్తత తీసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీని ఎస్పీ జానకీ షర్మిలా దత్తత తీసుకోవడంతో అదే స్ఫూర్తితో తన ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

విద్యార్థుల్లో నైపుణ్యం పెంచి, పదో తరగతిలో మంచి ఫలితాలు తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు.  ఆరేండ్లుగా విద్యార్థులకు సహాయం చేస్తూ చాలా మందిని ఆర్మీ , పోలీసులుగా  అయ్యేందుకు శిక్షణ కూడా ఇస్తున్నానని వివరించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ, నర్సాపూర్ ఎంఈఓ కిషన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్,  ఆర్ఐ వేణుగోపాల్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.