- బీజేపీ ఆశలు గల్లంతు
- కారు కనుమరుగు
- కాంగ్రెస్ మెజార్టీ 46,188
సంగారెడ్డి,వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్స్థానాన్ని కాంగ్రెస్కైవసం చేసుకుంది. సమీప బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ఎంపీ బీబీపాటిల్‌పై కాంగ్రెస్అభ్యర్థి సురేశ్కుమార్షెట్కార్ 47,896 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఉదయం 8గం.లకు పోస్టల్బ్యాలెట్తో మొదలైన కౌంటింగ్ఈ సెగ్మెంట్లోని 7 నియోజక వర్గాల వారీగా మొత్తం14 టేబుళ్లు, 145 రౌండ్ల లెక్కింపు కొనసాగింది.
ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 6,889 ఓట్లు పోలవ్వగా ఇందులో బీజేపీకి 3,716 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2,734 ఓట్లు, బీఆర్ఎస్కు కేవలం 304 ఓట్లు వచ్చాయి. కాగా 48 ఓట్లు రిజెక్ట్అయ్యాయి. ఇక రౌండ్ల విషయానికొస్తే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్క్యాండిడేట్సురేశ్షెట్కార్ ఆధిక్యం సాధించుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌కు మొత్తం 5,23,919 ఓట్లు పోలవ్వగా బీజేపీకి 4,76,023 ఓట్లు, బీఆర్ఎస్ కు1,71,412 ఓట్లు వచ్చాయి.
జహీరాబాద్సెగ్మెంట్లో తిరుగులేని పార్టీగా నిలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్స్థానాన్నికోల్పోయి 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ సిట్టింగ్ఎంపీగా ఉన్న బీబీపాటిల్ఎన్నికల టైంలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి బరిలో దిగారు. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన పాటిల్ మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో పనిచేస్తూ వచ్చారు. ఎలాగైనా గెలుస్తామన్న బీజేపీ నేతల ఆశలు గల్లంతయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అయిష్టంగానే బరిలో దిగినప్పటికీ పార్టీ లీడర్లు, కార్యకర్తల మద్దతు కూడగట్టుకోకపోవడం వల్లే ఓడిపోయారన్న ప్రచారం జరుగుతోంది.
రెండోసారి హస్తం హవా..
జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ రెండోసారి గెలిచి హవా చాటుకుంది. 2009లో ఏర్పడిన ఈ పార్లమెంట్సెగ్మెంట్లో మొదటి సారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి సురేశ్ షెట్కార్ గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019 లో బీఆర్ఎస్ తరపున బీబీ పాటిల్ విజయం సాధించారు. తాజాగా నాలుగో సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో సారి గెలుపొంది పార్టీ పూర్వ వైభవాన్ని సాధించుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.