ఇండస్ట్రీస్​ కమిటీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  • కాంగ్రెస్​ నేతల సంబురాలు

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్​ ఏరియాలో కాంగ్రెస్​టౌన్​ ప్రెసిడెంట్ నోములు ఉపేందర్​గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. 

పారిశ్రామికవేత్తగా అనుభవం కలిగిన ఎంపీ వంశీకృష్ణ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల శాఖ సంప్రదింపుల కమిటీలో మెంబర్​గా నియమించిందని తెలిపారు. కమిటీ సభ్యుడిగా ఎంపీ వంశీకృష్ణ సలహాలు, సూచనలు అందిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు కృషి చేయాలని   ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ ​లీడర్​ సొతుకు సుదర్శన్, కాంగ్రెస్​ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పుల్లూరి లక్ష్మణ్, సెక్రటరీ బత్తుల రమేశ్, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.