చెన్నూర్ .. కొమ్మెర ప్రాథమిక స్కూల్​లో నీటి కష్టాలకు చెక్

చెన్నూరు, వెలుగు: చెన్నూర్ మండలంలోని కొమ్మెర ప్రాథమిక పాఠశాలలో నూతన బోరు పంపు పనులను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్కూల్ టీచర్లు, గ్రామ ప్రజలు కలిసి ఇటీవల వినతిపత్రం అందజేశారు.

 వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డీఎంఎఫ్ టీ నిధులను మంజూరు చేసి కొత్త బోరును ప్రారంభించామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.