వెలుగు నెట్వర్క్ : దివంగత సీఎం వైఎస్సార్ రాష్ర్ట ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు.
మంచిర్యాలలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో , మందమర్రి, క్యాతనపల్లి లో కాంగ్రెస్ నాయకులు , కాగ జ్ నగర్ లో ఎమ్మెల్సీ దండే విఠల్ , నేరడిగొండ లో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడే వసంతరావు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.