కోల్‌బెల్ట్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న కాకా కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని కాంగ్రెస్ లీడర్లు అన్నారు. ఆదివారం మందమర్రిలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ జనరల్సెక్రటరీ సొతుకు సుదర్శన్ మాట్లాడారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాకా కుటుంబం పార్లమెంట్ పరిధిలో దశాబ్దాలు ప్రజలకు చేస్తున్న సేవలపై బాల్క సుమన్‌కు అవగాహన లేదన్నారు. ఎంపీగా, చెన్నూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన బాల్క సుమన్ ఎన్ని అక్రమాలు, దోపిడీలు చేశాడో ప్రజలకు తెలుసన్నారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రతి ఒక్కరికిపై అక్రమ కేసులు పెట్టించాడని అన్నారు.
కేటీఆర్‌తో కుమ్మకైన సుమన్నిత్యం వేలాది లారీల ద్వారా ఇక్కడి నుంచి అక్రమంగా ఇసుకను తరలించి వేల కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. స్నేహపూర్వకంగా జీవించే ఇక్కడి ప్రజల మధ్య విబేధాలు వచ్చేలా రెచ్చగొడుతూ సుమన్ తన రాజకీయపబ్బం గడుపుకున్నాడని మండిపడ్డారు. ప్రజలకు సేవలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకట
స్వామి, ఎంపీ వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నెరువట్ల శ్రీనివాస్, సేవాలాల్ జిల్లా అధ్యక్షులు ఎండీ హఫీజ్, లీడర్లు కనకం రాజు, ఎండీ సుకూర్, బూడిద శంకర్, మంకు రమేశ్, వడ్లూరు సునీల్ కుమార్, ఉదయ్, ఎండీ ఇసాక్, చోటే మియా, జావిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అసత్య ఆరోపణలను సహించం
చెన్నూర్, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నీతినిజాయితీ గల ఎమ్మెల్యే వివేక్ పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కోటపల్లి మాజీ జడ్పీటీసీ పోటు చిన్న రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు హేమంత రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమల్ల గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల బాపగౌడ్ తదితరులు పాల్గొన్నారు.