ఆదిలాబాద్​ జిల్లాలో మొహరం సవార్ల సందడి

ఆదిలాబాద్/జన్నారం/జైపూర్, వెలుగు: మొహరం పండుగ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో సవార్ల సందడి నెలకొంది. మతసామర్యసానికి అతీతంగా అన్ని ప్రాంతాల్లోని ప్రజలు మొహరం వేడుకలు జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా సవార్లు, డోల్లు, డుమ్కిలతో ఊరేగింపులు నిర్వహించారు. జన్నారం మండలంలోని కామన్ పెల్లి, కిష్టాపూర్, గాంధీనగర్​కు చెందిన భక్తులు పీరీలను మండల కేంద్రంలో ఊరేగించారు. మొహహం పండుగ సందర్భంగా గురు, లేదా శుక్రవారం పీరీలను నిమజ్ఞనం చేయనున్నట్లు తెలిపారు.

వివేక్​కు మంత్రి పదవి దక్కాలని ప్రార్థనలు

చెన్నూర్ ఎమ్మెల్యే డా.గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కాలని భీమారం మండల కాంగ్రెస్ నేత కొక్కుల నరేశ్ ఆధ్వర్యంలో బి.ఫాతిమా హుస్సేన్, హుస్సేన్ ఆషుర్ ఖానా దర్గాలో పీరీలకు ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరిన్ని సేవలు చేస్తారని అన్నారు. కాంగ్రెస్​నాయకులు అలాకాటి తిరుపతి, రవి, బి.సుధాకర్, బానేశ్ తదితరులు పాల్గొన్నారు.