ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని గణపతికి పూజలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని 13 వినాయక మండపాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు చేశారు. ఒక్కో వినాయకుడి దగ్గర 11 కొబ్బరికాయలు కొడుతూ ప్రత్యేక పూజలు చేశారు. 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే వివేక్ కి మంత్రి పదవి వస్తే చెన్నూరు నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి చెందుతుందని... యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు స్థానిక కాంగ్రెస్ నాయకులు.