ఎమ్మెల్యే​ను గూడెం మహిపాల్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

పటాన్​చెరు,వెలుగు:ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్​లో చేరికతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకపోనుందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం  ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు డోకూరి రామ్మోహన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బాబు, అతీక్ ఎమ్మెల్యే ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సమష్టి కృషితో ఇటు పార్టీని అటు పటాన్​చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్​ సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగేశ్ యాదవ్ పాల్గొన్నారు.