మంత్రి  సీతక్కను కలిసిన కాంగ్రెస్ నాయకులు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు :   ఆదిలాబాద్ రూరల్ మండలంలోని  రామాయి శివారులో నిర్మించనున్న రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ  నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.   ఈ విషయమై  కాంగ్రెస్  అసెంబ్లీ  ఇన్​చార్జి  కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల  వర్కింగ్ ప్రెసిడెంట్  నాగన్న శనివారం హైదరాబాద్​లో  మంత్రిని కలిశారు.  రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.