- బీఆర్ఎస్ లీడర్‌పై పోలీసులకు ఫిర్యాదు
కోల్‌బెల్ట్,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఫేస్బుక్లో కించపరిచే విధంగా అస్యత ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టిన మంచిర్యాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్ గోగుల రవీందర్‌రెడ్డిపై శుక్రవారం కాంగ్రెస్ లీడర్లు మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గోగుల రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఆయన పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ ను జిల్లా యూత్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్మ మహేందర్, లీడర్లు కోరారు. రవీందర్‌రెడ్డిపై కాంగ్రెస్ లీడర్లు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.