చెన్నూరు ఎమ్మెల్యే వివేక్పై ఆరోపణలు.. బీజేపీకి కాంగ్రెస్ నేతల వార్నింగ్

మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీజేపీ నాయకులు చేసిన అసత్యపు ఆరోపణలపై సీరియస్ అయ్యారు చెన్నూర్ కాంగ్రెస్ నేతలు. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రతిపక్షం నేతలు ఓర్వలేక అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు  కాంగ్రెస్ నేతలు.

చెన్నూర్ మండలం నాగాపూర్ గ్రామంలో రోడ్డు పనులకు అంచనా చేయడం జరిగిందని... నిధులు వచ్చిన వెంటనే రోడ్డు వేస్తామని తెలిపారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారంలో 3 రోజులు నియోజకవర్గంలోనే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు.