బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలె

  • ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలపై నిరసన

కోల్​బెల్ట్, వెలుగు : అధికారం కోల్పోయిన బాల్క సుమన్​రాజకీయ మనుగడ కోసం ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కాంగ్రెస్​లీడర్లు,​ మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, పైడిమల్ల నర్సింగ్ మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ రాజీవ్​ చౌక్​ వద్ద వివేక్​ యువసేన ఆధ్వర్యంలో బాల్క సుమన్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ..​ బాల్క సుమన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు సుమన్​ బొగ్గు దందా, ఇసుక దందా, భూదందాలతో కోట్ల రూపాయలు సంపాదించాడని, ఇప్పటికైనా ఆయనపై పోలీసులు ఎంక్వయిరీ చేసి జైలుకు పంపాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు

తగాదాలకు వెళ్లేలా ప్రోత్సాహించడని ఆరోపించారు. 50 ఏండ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న కాకా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కాంగ్రెస్, యువసేన లీడర్లు అర్జున్​మహంతో, సురేందర్, పాల రాజయ్య, బంగారు ప్రసాద్, ఏల్పుల స్వామి, సంజిత్ సింగ్, వెంకటేశ్, బాపు, దొంతమల్ల శ్యామ్, దొరిశెట్టి సత్తన్న, పద్మ, శ్యామల, రాణి తదితరులు పాల్గొన్నారు.