రైతులపై బీఆర్ఎస్​ది కపట ప్రేమ : ముజాఫర్ ఆలీఖాన్

జన్నారం, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ జన్నారం మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్ విమర్శించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్​లో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కడెం ప్రాజెక్టు రిపేర్లకు రూ.9.40 కోట్లు మంజూరు చేయించారని.. కడెం, జన్నారం మండలాల్లోని ప్రతి గ్రామానికి యాసంగిలో సాగు నీటిని విడుదల చేస్తామని చెప్పినట్లు గుర్తుచేశారు.

కానీ బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్ చార్జి భూక్య జాన్సన్ నాయక్ కడెం ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో రైతులను అయోమయానికి గురిచేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైన ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. పార్టీ నాయకులు మిక్కిలినేని రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, మచ్చ శంకరయ్య, మాణిక్యం, ఇందయ్య, లక్ష్మీనారాయణ, రాయమల్లు గౌడ్ పాల్గొన్నారు.