కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో కొండపాక ఎంపీపీ

  •     మార్చి 6న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీపై అవిశ్వాసం
  •     కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో పాటు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ, ఇండిపెంట్ల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికైన అనసూయ

కొండపాక, వెలుగు :  సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని కొండపాక ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీటీసీలకు తోడుగా బీజేపీ, ఇండిపెండెంట్లతో పాటు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎంపీటీసీలు సైతం మద్దతు తెలపడంతో మంచాల అనసూయ ఎంపీపీగా ఎన్నికయ్యారు. గతంలో ఎన్నికైన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ ర్యాగల సుగుణ దుర్గయ్య తమకు నిధులు కేటాయించడం లేదంటూ 9 మంది ఎంపీటీసీలు మార్చి 6న అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. దీంతో బుధవారం ఐవోసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. 

మొత్తం 13 మంది సభ్యులకుగానూ 10 మంది హాజరు కాగా మాజీ ఎంపీపీ, వైస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీతో పాటు, మరో సభ్యుడు హాజరుకాలేదు. మీటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వారిలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన దుద్దెడ ఎంపీటీసీ పిల్లి శిరీష, ఖమ్మంపల్లి ఎంపీటీసీ యాదన్న, బీజేపీకి చెందిన సిర్శనగండ్ల ఎంపీటీసీ నందల శ్రీనివాస్, ఇండిపెండెంట్లు బాలాజీ, భూములుగౌడ్, పత్తి ఆంజనేయులుతో పాటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రణవి, సాయిబాబా, ఆరుట్ల లక్ష్మి కొండపాక ఎంపీటీసీ 1 మంచాల అనసూయకు మద్దతు తెలిపారు. దీంతో ఆమె ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అనసూయ నోటీసు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకారం చిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ అందరి సహకారంతో నిధులు తీసుకొచ్చి, మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ చిట్టి దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు వాసరి లింగారావు, నాయకులు గజ్వేల్‌‌‌‌‌‌‌‌ సుదర్శన్‌‌‌‌‌‌‌‌, కోహెడ వెంకటేశం, సురేందర్‌‌‌‌‌‌‌‌రావు, నర్సింహాజారి, పెద్దాంకుల శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.