- విద్యార్థులకు బ్యాగులు, ప్లేట్ల పంపిణీ
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : కాంగ్రెస్ఆదిలాబాద్నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి బర్త్‌డే వేడుకలను సోమవారం స్థానిక ప్రజాసేవా భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించి 150 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి కేక్‌కట్ చేసిన శ్రీనివాసరెడ్డి దంపతులు.. హౌసింగ్ బోర్డు, రణదివ్యనగర్ కాలనీల్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బ్యాగులు, ప్లేట్లు అందజేశారు.
నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీశ్, కలాల శ్రీనివాస్, చంద నర్సింగ్, ఇమ్రాన్, డేరా కృష్ణారెడ్డి, షకీల్, మహాకాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.