మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ లేఖల కలకలం

  • సుమోటో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు
  • ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌‌‌‌‌‌‌కు సెక్యూరిటీ పెంపు, రోప్​ పార్టీ కేటాయింపు
  • క్యాంప్​ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సీసీ కెమెరాలు, మెటల్​ డిటెక్టర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు  

మంచిర్యాల/తాండూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్​లీడర్ల పేర్లతో మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌లు వార్నింగ్‌‌‌‌‌‌‌‌ లెటర్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయడం కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌‌‌‌‌‌‌ అనుచరులైన కొందరు లీడర్లు భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని, వారు తమ పద్దతి మార్చుకోవాలని సింగరేణి కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌ ఏరియా కార్యదర్శి భరత్‌‌‌‌‌‌‌‌ పేరిట లేఖలు విడుదల అయ్యాయి. అయితే మావోయిస్టుల వార్నింగ్‌‌‌‌‌‌‌‌ లెటర్లలో నిజం ఎంత ? అని పోలీసులు, కాంగ్రెస్​నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లిలో జరిగే భూకబ్జాల విషయంలో లీడర్ల మధ్య ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎమ్మెల్యే వినోద్‌‌‌‌‌‌‌‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు వార్నింగ్ లెటర్లు ఇచ్చారని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రవికుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

ఎమ్మెల్యే వినోద్‌‌‌‌‌‌‌‌కు సెక్యూరిటీ పెంపు

మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ల హెచ్చరికల నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌‌‌‌‌‌‌కు పోలీసులు సెక్యూరిటీ పెంచారు. ప్రస్తుతం ఉన్న గన్‌‌‌‌‌‌‌‌మెన్లతో పాటు అదనంగా సిబ్బందిని, పర్యటనలో ఆయన వెంట ఉండేందుకు రోప్‌‌‌‌‌‌‌‌ పార్టీని నియమించారు. అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ మెయిన్​ గేటు దగ్గర మెటల్‌‌‌‌‌‌‌‌ డిటెక్టర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు వచ్చే నాయకులు, కార్యకర్తలను చెక్‌‌‌‌‌‌‌‌ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో 10 సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్నారు. ఈ పనులను శనివారం నుంచి మొదలుపెట్టారు. క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ చుట్టుపక్కల పోలీస్‌‌‌‌‌‌‌‌ నిఘాను పెంచారు.