డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల శిశువు చనిపోయాడని ఆందోళన

మెదక్​టౌన్, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమ శిశువు చనిపోయాడని ఆరోపిస్తూ ఓ కుటుంబానికి చెందినవారు, వారి బంధువులు మెదక్​పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్ ) వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే..  హవేలీ ఘన్​పూర్​ మండలం కూచన్​పల్లి గ్రామానికి చెందిన గర్భిణి నామ భవానిని ఈనెల 28న హాస్పిటల్​లో అడ్మిట్​చేయగా29న ఆమె బాబుకు జన్మనిచ్చింది.  బాబుకు జ్వరం వచ్చిందని చూడాలని డాక్టర్​ అరుణ నాయుడుకు చెప్పినప్పటికీ ఎలాంటి ట్రీట్​మెంట్​ ఇవ్వకపోగా,  తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని దీంతో పుట్టిన బాబు మృతి చెందారని తండ్రి శ్రీధర్​ ఆరోపించాడు. 

ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్​ముందు 2 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. బాబు మృతికి కారణమైన డాక్టర్​తో పాటు వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హాస్పిటల్​సూపరింటెండెంట్​చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.