జైనూర్‌‌‌‌‌‌‌‌ ఘటనకు నిరసనగా ఆదివాసీల బంద్‌‌‌‌‌‌‌‌

  • ఆదిలాబాద్,​ ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో తెరుచుకోని దుకాణాలు, రోడ్డెక్కని బస్సులు 
  • నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ 

ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని, వలస లంబాడీలను ఏజెన్సీ నుంచి తరలించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో బంద్‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. ఇందులో భాగంగా తుడుందెబ్బ నాయకులు శనివారం తెల్లవారుజామునే ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌‌‌‌‌ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరో వైపు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌‌‌‌‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. 

జిల్లా కేంద్రాలతో పాటు జైనూర్, సిర్పూర్‌‌‌‌‌‌‌‌ యు, లింగాపూర్‌‌‌‌‌‌‌‌ కెరమెరి, వాంకిడి, తిర్యాణి, బెజ్జూర్‌‌‌‌‌‌‌‌, నేరడిగొండ, బోథ్‌‌‌‌‌‌‌‌, సొనాల, గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌, నార్నూర్‌‌‌‌‌‌‌‌ మండలాల్లో ప్రజలు వ్యాపార, వాణిజ్య సముదాయాలు, స్కూళ్లను స్వచ్చంధంగా బంద్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆదివాసీ నాయకులు నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించిన అనంతరం, నిందితుడిని ఉరి తీయాలంటూ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఖలీమ్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. 

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు గోడం గణేశ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ బాధితురాలి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఖర్చును ప్రభుత్వమే భరించాలని, ఆమె ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వం, గవర్నర్‌‌‌‌‌‌‌‌ స్పందించి ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో తుడుందెబ్బ నాయకులు కోవ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళ అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిర పాల్గొన్నారు.