పులి చంపిన ఆవుకు పరిహారం అందజేత

జైనూర్, వెలుగు : జోడేఘాట్ రేంజ్ పరిధి జైనూర్ మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రెండ్రోజుల క్రితం సుంగాపూర్ గ్రామానికి చెందిన సిడం ఖన్నిరామ్ అనే కోలాం ఆదివాసీ రైతు దూడను హతమార్చగా.. బుధవారం జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రావుతో కలిసి డీఎఫ్ వో నీరజ్ కుమార్ బాధితుడికి రూ.25 వేల నష్టపరిహారం అందజేశారు. ఫారెస్ట్ లో పులి సంచరిస్తోందని, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఏర్పాటు చేసిన సీసీ  కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఫీమేల్ టైగర్ గా గుర్తించినట్లు జోడేఘాట్ రేంజ్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. మహారాష్ట్రలోని అటవీ ప్రాంతానికి ప్రవేశ్నించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కెరిమెరి ఎఫ్ఆర్వో మజారోద్దీన్, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.