కాగజ్‌నగర్‌లో జబర్దస్త్ ఫేమ్ అప్పారావు సందడి

కాగజ్ నగర్, వెలుగు: కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు కాగజ్​నగర్ పట్టణంలో సందడి చేశారు. దర్శకుడు మల్లికార్జున్ నిర్మిస్తున్న ఓ ఓటీటీ మూవీకి సంబంధించి ప్రొడ క్షన్స్ నెం1 షూటింగ్ బుధవారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో ప్రారంభ మైంది. అప్పారావు డాక్టర్​గా నటించే సన్నివేశాలను అక్కడ షూట్​చేశారు. ఆయనతో పాటు స్థానిక కళాకారుడైన ఈర్ల సునీల్​తో ‌కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్ కాగజ్‌నగర్‌ పట్టణంలో మరో నాలుగు రోజులు ఉంటుందని దర్శకుడు తెలిపారు.