దండం పెడతాం.. మా ఊరికి రోడ్డు వేయండి

  • కలెక్టర్​కు చేతులెత్తి వేడుకున్న ఆదివాసీలు 

తిర్యాణి, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల ఆదివాసీలు తమ గ్రామానికి రోడ్డు వేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే,  అడిషనల్ కలెక్టర్ దీపక్ తీవారి, డీఎఫ్​వో  నీరజ్ కుమార్ టిబ్రీవాల్​ను చేతులెత్తి వేడుకున్నారు. నీతి ఆయోగ్ కార్యక్రమానికి శుక్రవారం తిర్యాణికి వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో అడ్డుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. సరైన రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐబీ తాండూర్ త్రింక్లైన్ నుంచి తిర్యాణి, తిర్యాణి నుంచి గుండాల గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ అధికారులను ఆదేశించి సమస్య పరిష్కారినికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జిల్లా నాయకుడు ధార్ము, గణపతి తదితరులు ఉన్నారు.