గేమ్స్​తో ఫిజికల్ ఫిట్​నెస్ : కలెక్టర్ వెంకటెశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: గేమ్స్ ఆడటం ద్వారా ఫిజికల్ ఫిట్​నెస్ కలుగుతుందని కలెక్టర్ వెంకటెశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్​జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాల ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు  పోటీల్లో ప్రతిభ కనబర్చాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలన్నారు. ప్రతిభ కనబరిచినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.