ఆసిఫాబాద్, వెలుగు : పంట సాగులో రైతన్నలకు మెలకువలు అందించేందుకే రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం 15వ ధారావాహిక కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఏవో శ్రీనివాస్ రావుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటలో స్వల్పకాలిక రకాల సాగు, ముఖ్యమైన పంటల్లో కలుపు యాజమాన్యంపై రాష్ట్ర స్థాయి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ నిర్వహించామన్నారు. పంటల సాగులో ఎదురయ్యే సమస్యలపై ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తారని తెలిపారు.