డిసెంబర్ 20 నుంచి స్కూళ్ల సమయంలో మార్పు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో చలి తీవ్రమవుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉపాధ్యాయ సంఘాల నాయకులు  అందించిన వినతి మేరకు ఈ నెల 20 నుంచి పాఠశాలల సమయంలో మార్పు చేసినట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతున్న స్కూళ్ల సమయాన్ని.. ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ప్రైవేట్ యాజమాన్యాలకు కింద నిర్వహిస్తున్న పాఠశాలలు నూతన సమయపాలన పాటించాలన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇదే సమయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.