డాక్టర్లు విధులు సక్రమంగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి

జహీరాబాద్, వెలుగు: గవర్నమెంట్​ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్లు విధులు సక్రమంగా నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి సూచించారు. బుధవారం జహీరాబాద్ లోని గవర్నమెంట్​ఏరియా హాస్పిటల్​ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్​ను పరిశీలించి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని హాస్పిటల్​సూపరిండెంట్ శ్రీధర్ ను ఆదేశించారు.

వార్డులను కలియతిరిగి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో సౌకర్యాలు, మందులు తదితర వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. హాస్పిటల్​లో అధికంగా ప్రసవాలు జరిపించి బాలింతలకు మంచి సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు నాగరాజు పటేల్, శేషురావు, కిరణ్మయి, సిబ్బంది పాల్గొన్నారు .