భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి టౌన్, వెలుగు: త్రిపుల్ ఆర్​కు సంబంధించి మొత్తం 712 ఎకరాలకు చెందిన భూ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో నేషనల్ హైవే,  సంగారెడ్డి, ఆందోల్ రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. భూ సమస్యలు ఉంటే సర్వే చేసి నివేదికలు అందజేయాలన్నారు.

రీజినల్ రింగ్ రోడ్, నేషనల్​ హైవే అనుసంధానంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్  మురళీధర్, గణేశ్, వసంత కుమారి, పాండు , తహసీల్దార్లు  సంబంధిత అధికారులు  పాల్గొన్నారు .