రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు

రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా  కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఈవో రామకృష్ణ, అర్చకులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్, జిల్లా అధికారులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

జగిత్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతల స్వీకరణ 

జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  బి.సత్యప్రసాద్ ఆదివారం పూర్వ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాస్మిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాషా నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కలెక్టర్ కు పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జగిత్యాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో డాక్టర్ ఎండీ సమియుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ రాంబాబు, ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.