- జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ తెలిపారు. మొత్తం 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 14 ,951 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలు, మధ్యాహ్నం1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామన్నారు.
ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2,30 గంటలకు గేట్లు మూసివేస్తామన్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2, 16వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్- 3, మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-4 పరీక్షలు ఉంటాయని తెలిపారు.