ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆఫీసర్లకు ఆదేశించారు. బుధవారం ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తో కలసి కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌కు వచ్చి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్‌లో మహిళా శక్తి క్యాంటీన్, బంగారి గూడ కేజీబీవి స్కూల్, కమాండ్ కంట్రోల్ సెంటర్, మదర్ పౌల్ట్రీ యూనిట్‌లను ఓకే చోటి నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.