లెక్కల మాస్టర్ గా మారిన కలెక్టర్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా లెక్కల మాస్టర్​గా మారారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తలమడుగు మండలంలోని బరంపూర్ జడ్పీఎస్​ఎస్​ను సందర్శించారు. 

కాలానుగున వ్యాధుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం టెన్త్​క్లాస్ స్టూడెంట్లకు లెక్కలు బోధించారు. వారితో లెక్కలు చేయించి సందేహాలు తీర్చారు.