వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నార్నూర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. హాస్పిటల్ లో రికార్డులను పరిశీలించి,మలేరియా, డెంగ్యూ, సాధారణ జ్వరాలకు సంబంధించి రిజిస్టర్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

ఇంటింటి సర్వే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 5 వరకు చేయాలని పేర్కొన్నారు. ఒక వైద్యుడిని తప్పనిసరిగా నైట్ డ్యూటీకి నియమించాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ ను ఆదేశించారు. ర్యాపిడ్ టెస్టులు, బ్లడ్ టెస్ట్ చేయాలని , పరికరాలు పనిచేయక పోతే రిపేర్ చేయించుకోవాలని సూచించారు.