సమగ్ర కుటుంబ సర్వేకు ప్రత్యేక ఏర్పాట్లు : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్​(జైనథ్​), వెలుగు: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్​రాజర్షి షా తెలిపారు. జైనథ్​మండలంలోని రైతు వేదికలో బుధవారం సూపర్​వైజర్లు, ఎన్యూమరేటర్లకు నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరయ్యారు.

 నవంబర్​6 నుంచి 18వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. 1వ తేదీ నుంచి 3 వరకు ఇండ్ల జాబితా సేకరించి ఇంటింటికి స్టిక్కర్స్ అతికించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్​శ్యాంసుందర్, ఎంపీడీవో వెంకటరాజు, సూపర్ వైజర్స్, ట్రైనర్లు, ఎన్యుమారెటర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెంపొందించాలి

పిల్లలకు ప్రాథమిక స్థాయిలోనే చదివించడం అలవాటు చేయిస్తే వారు స్వతంత్ర పాఠకులుగా ఎదుగుతారని కలెక్టర్​రాజర్షి షా అన్నారు. జైనథ్​మండలంలోని దీపాయిగూడ మండల ప్రైమరీ స్కూల్​లో రూమ్ టు రీడ్ ఇండియా ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని కలెక్టర్ ప్రారంభించారు. లైబ్రరీలో విద్యార్ధులతో పాఠాలు చదివించారు. రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్, యూఎస్​ఏఐడీ సహకారంతో జిల్లాలో ప్రతి మండలానికి ఒక మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.