డిజిటల్​ కార్డు డేటా పక్కగా ఎంట్రీ చేయాలి : కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:   ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎంట్రీ చేయాలని  కలెక్టర్​ రాజర్షి షా సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన   డేటా ఎంట్రీపై కమిషనర్​  ఖమర్​ అహ్మద్​తో సమీక్షించారు.  

కుటుంబ ఫొటో ను  ఆన్ లైన్ లో తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలని, ఈ నెల 11లోపు  నివేదిక  ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో  ఆర్​డీఓ వినోద్ కుమార్, ఈడీఎమ్​ రవీందర్, ఆపరేటర్స్, తదితరులు  పాల్గొన్నారు.