వెలుగు ఎపెక్ట్ : హెచ్చరించినా నిర్లక్ష్యం చేస్తారా..?

  • ప్రైవేట్ హాస్పిటల్​పై కలెక్టర్ రాజర్షి షా సీరియస్ 
  • డెంగ్యూ నిర్ధాణ పరీక్షలు రిమ్స్​కే పంపాలని ఆదేశం

ఆదిలాబాద్, వెలుగు: ప్రైవేట్ హాస్పిటల్స్​లో నమోదయ్యే డెంగ్యూ కేసుల వివరాలకు రిజిస్ట్రర్ మెయింటెనెన్స్ చేయాలని హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యం చేయడం పట్ల కలెక్టర్ రాజర్షి షా సీరియస్ అయ్యారు. ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన ‘ప్రైవేట్ హాస్పిటల్స్ డెంగ్యూ కేసుల లెక్కలేవి ?’ అనే కథనంపై స్పందించిన కలెక్టర్ గురువారం జిల్లా కేంద్రంలోని గజానంద్​ ప్రైవేట్ హాస్పిటల్​ను తనిఖీ చేశారు. నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి వైద్యాధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జ్వరాలు, డెంగ్యూ కేసుల వివరాలను నమోదు చేయకపోవడం, మెడిసిన్ స్టాక్ డిఫరెన్స్ రావడంపై అసహనం వ్యక్తం చేశారు. 

డెంగ్యూ నిర్ధాణ పరీక్షలు రిమ్స్​కే పంపాలని ఆదేశించారు. రెండ్రోజుల క్రితమే పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులు, వార్డులకు పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు నాలుగు రోజుల క్రితం ప్రయివేట్ ఆస్పత్రుల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి డెంగ్యూ, రాపిడ్ టెస్ట్, చికిత్స ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, నిబంధనల మేరకు అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలందించాలన్నారు. ఎప్పటికప్పుడు కేసుల వివరాలు రిజిస్టర్​లో నమోదు చేయాలని ఆదేశించారు.