బతుకమ్మ ఆడిన కలెక్టర్

ఆదిలాబాద్/కుభీర్, వెలుగు : మెప్మా ఆధ్వర్యంలో ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా  ఉద్యోగులతో కలిసి కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి  బతుకమ్మ ఆడారు.

కుభీర్ మండల కేంద్రంలోని వివేకానంద, తపస్వి డిగ్రీ కాలేజీలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు సట్ల రవి, సంధ్యారాణి, అధ్యాపకులు దత్తాత్రి, సాయన్న, రాములు, లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు.