మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికొట్టాల్ వద్ద పాత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ పనులను స్పీడప్ చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మెడికల్ కాలేజీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూఢిల్లీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కాలేజీ పరిశీలనకు ఎప్పుడైనా రావచ్చని, ఆలోపు పనులన్నీ పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కలెక్టర్‌తోపాటు జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివదయాల్, కాలేజీ ప్రిన్సిపాల్, అధికారులు పాల్గొన్నారు.
వారంలో వడ్ల కొనుగోళ్లు పూర్తిచేయాలి
మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయని, వారంలో కొనుగోళ్లు పూర్తి చేసి మిల్లులకు తరలించేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం మెదక్ మండలం చిట్యాల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు.