సీజనల్​ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్​ రాహుల్​ రాజ్

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్​ జిల్లాను ఆరోగ్య జిల్లాగా లక్ష్యంగా పని చేయాలని  కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు.    ‘స్వచ్ఛదనం– పచ్చదనం’  కార్యక్రమంలో భాగంగా మూడో రోజు మెదక్  మొక్కలు నాటారు.  అనంతరం  డంపింగ్ యార్డును  పరిశీలించారు.  సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు పాటించాలన్నారు.   జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని  సూచించారు.  

హవేళీ ఘనపూర్​ మండలం ధూప్ సింగ్ తండా   మార్గమధ్యంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించారు.  పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో డీపీవో యాదయ్య, మెదక్​ మున్సిపల్​ ఛైర్మన్​ చంద్రపాల్​, కమిషనర్​ జానకీ రామ్​ సాగర్​, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.