మెదక్​ జిల్లాలో రిపేర్ ​పనులను స్పీడప్​ చేయాలి : కలెక్టర్​ రాహుల్​ రాజ్

మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్​స్కూళ్లలో చేపట్టిన రిపేర్​పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. గురువారం హవేళీ ఘనపూర్ మండలం కూచన్​పల్లి గవర్నమెంట్​స్కూల్​లో రిపేర్​పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న గవర్నమెంట్​స్కూళ్లను రిపేర్​చేయడం ద్వారా కార్పొరేట్​స్కూళ్లలా మారుతున్నాయన్నారు. స్కూల్స్​రీ ఓపెన్​కి ముందే చేపట్టిన పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్​అధికారులు ఆదేశించారు.

బడి మానేసిన పిల్లలందరినీ గవర్నమెంట్​ స్కూళ్లలో చేర్పించాలని టీచర్లకు సూచించారు. అలాగే స్కూల్స్​రీ ఓపెనింగ్​చేసే సమయానికల్లా స్టూడెంట్స్​కు యూనిఫారాలు అందించాలన్నారు. మండలంలోని ఫరీద్​పూర్​లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిఫారాల కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, తహసీల్దార్ నారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.