మెదక్‌టౌన్, చిలప్‌చెడ్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, ఫర్టిలైజర్షాపుల యజమానులు లైసెన్సులు కలిగి ఉండాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్ సూచించారు. గురువారం చిలప్‌చెడ్ మండలంలోని రాజ్ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంలో తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్‌ను చెక్‌చేశారు. పీవోఎస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలని సూచించారు.
అనంతరం తహసీల్దార్ఆఫీసులో తనిఖీలు చేసి ధరణి పెండింగ్దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను తనిఖీ చేసి పదో తరగతి స్టూడెంట్స్‌ను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యం తెలుసుకున్నారు. బోధన నైపుణ్యాలు మెరుగుపరచాలని టీచర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నపిల్లలకు అందుతున్న పౌష్టికాహారం వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, డీఈవో రాధాకిషన్, తహసీల్దార్ముసాదిక్, డీటీ సింధూజ, అధికారులు ఉన్నారు.