తూప్రాన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని ఇస్లాంపూర్, మల్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ జోజి, ఆర్డీవో జయ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మున్సిపల్ చైర్పర్సన్జ్యోతి, కమిషనర్ ఖాజా మోయినోద్దీన్, డీఈవో రాధా కిషన్, ఎంపీడీవో, తహసీల్దార్పాల్గొన్నారు.
రామాయంపేట: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వచ్ఛధనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రామాయంపేటలో పర్యటించారు. స్థానిక టీ ఎస్ రెసిడెన్షియల్ స్కూల్ లో మొక్కలు నాటారు. అనంతరం 4వ వార్డులో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ఈ ఒక్క ఈ రోజే 2 లక్షల మొక్కలు నాటామని ఇప్పటివరకు 80 శాతం మొక్కలు నాటడం పూర్తి అయినట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
మెదక్: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. మెదక్కలెక్టరేట్మీటింగ్హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా గ్రామాల్లో కొత్త వార్డుల ఏర్పాటు, వార్డుల విభజన, జనాభా, లింగ నిష్పత్తి ప్రాతిపదికన రికార్డు చేయాలన్నారు.
రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున, తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంతవరకు గ్రామా, మండల స్థాయిలో సమాచారాన్ని క్రోడీకరించుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కంప్యూటర్ఆపరేటర్లు పాల్గొన్నారు.