గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి : రాహుల్​రాజ్

మెదక్​టౌన్​, వెలుగు: గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం పీసీ మహలనోబీస్​జయంతి సందర్భంగా అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు తో కలిసి  ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య ప్రణాళిక అధికారి ఆఫీసులో జరిగిన మీటింగ్​లో సీపీవో మాన్య నాయక్  ప్రసంగిస్తూ మండల ప్లానింగ్ అధికారులు, డివిజనల్ లెవెల్ స్టాటిస్టికల్ ఆపీసర్లు నిర్దేశిత గడువు లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. 

సమావేశంలో జిల్లా గణాంక అధికారి మాకం బద్రీనాథ్, ఉప గణాంకాధికారి సురేశ్, సహాయ గణాంకాధికారి సురేశ్, మండల ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.