ఇన్​స్పైర్​ మనాక్​ నామినేషన్లను స్పీడప్​ చేయాలి : కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఇన్​స్పైర్​ మనాక్​ నామినేషన్లను వేగవంతం చేయాలని, అన్ని స్కూళ్ల లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ తెలిపారు.

 మంగళవారం ఆయన ఛాంబర్​లో డీఈవో రాధాకిషన్​, డీఎస్​వో రాజిరెడ్డితో కలిసి ఇన్​స్పైర్​ మనాక్​ వాల్​పోస్టర్​ను ఆవిష్కరించారు. ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి ఐదు నామినేషన్లను ఆన్​లైన్​లో సెప్టెంబర్ 15 లోగా అప్​లోడ్​ చేయాలని ఆదేశించారు.