మెదక్, వెలుగు: జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల ఇంటింటి సర్వేలో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్నుంచి ఇంటింటి సర్వే నిర్వహణ తీరును సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా లేని ఆవాసాలు, ప్రాంతాలు, ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వేను ప్రారంభించిందని తెలిపారు.
ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయిందని, నిర్దేశిత గడువు తేదీలోగా పూర్తిచేసే దిశగా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. గూగుల్ మీట్ లో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.