మెదక్టౌన్, వెలుగు: స్కూల్స్ రీ ఓపెన్ అయ్యేలోగా అమ్మ ఆదర్శ స్కూల్స్లో రిపేర్పనులు పూర్తి కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ రమేశ్, డీఈవో రాధాకిషన్, ఇరిగేషన్ డీఈ, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ స్కూల్స్లో ఏర్పాటుచేయాల్సిన వసతులపై అధికారులకు సూచనలు చేశారు.
స్టూడెంట్స్సంఖ్యకు అనుగుణంగా తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు నర్సింలు, శ్రీనివాసులు, మెప్మా పీడీ ఇందిర పాల్గొన్నారు.