నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా2. లక్షల 69 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. రైస్ మిల్లులలో ధాన్యం నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో గద్వాల్ జిల్లాకు 20 వేలు, మహబూబ్ నగర్ జిల్లాకు 10 వేలు, సిద్దిపేట జిల్లాకు 10 వేల మెట్రిక్ టన్నులు తరలించామన్నారు.
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో 100 శాతం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజిరెడ్డి, ఆర్ఐ గంగాధర్ గౌడ్, వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ, సొసైటీ చైర్మన్ బాపు రెడ్డి, ఏపీఎం రాములు, ఏఈవో కావేరి, సెక్రటరీ నర్సింలు, సీఈవో శోభారాణి ఆయన వెంట ఉన్నారు.